- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 ఏళ్లుగా పురుషుడిలో బుతుస్రావం.. గర్భాశయం గుర్తించిన వైద్యులు
దిశ, ఫీచర్స్ : చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన 'చెన్ లీ' గత 20 ఏళ్లుగా యూరినరీ సమస్యలతో బాధపడుతున్నాడు. తరచూ మూత్రంలో రక్తస్రావం అనుభవిస్తున్నాడు. దీంతో గతేడాది మెడికల్ చెకప్ చేయించుకోగా.. తనకు ఫిమేల్ సెక్స్ క్రోమోజోమ్స్, అండాశయాలతో పాటు గర్భాశయం ఉందని తేలడంతో షాక్‌కు గురయ్యాడు. బుతుస్రావం కారణంగానే నెలవారిగా యూరిన్‌లో రక్తంతో పాటు పొత్తికడుపులో అన్‌కంఫర్ట్ ఎదుర్కొన్నట్లు నిర్ధారించబడింది. దీంతో వైద్యులను సంప్రదించగా.. తనలోని స్త్రీ పునరుత్పత్తి అవయవాలను మూడు గంటల సర్జరీ ద్వారా సక్సెస్‌ఫుల్‌గా తొలగించారు.
గ్రీక్ రిపోర్టర్ ప్రకారం.. చెన్ ఇంటర్‌సెక్స్(ఉభయలింగ శరీరం) లక్షణాలతో జన్మించాడు. అంటే బాహ్యంగా పురుష జననేంద్రియాలు ఉన్నప్పటికీ అంతర్గతంగా ఫిమేల్ సెక్స్ క్రోమోజోమ్స్, అండాశయాలతో పాటు గర్భాశయాన్ని కలిగి ఉన్నాడు. ఇక గతంలో ఇంటర్‌సెక్స్ వ్యక్తులను 'హెర్మాఫ్రొడైట్స్'గా పిలిచేవారు. ఎక్కడైనా ప్రతి 200 జననాల్లో ముగ్గురి నుంచి 2000 జననాల్లో ఒకరి వరకు ఇంటర్ సెక్స్ లక్షణాలతో పుట్టే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు ప్రపంచ జనాభాలో 0.05 నుంచి 1.7% మంది ఇంటర్‌సెక్స్‌గా నమోదవుతారని నివేదించారు.