- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాబ్ తిప్పలు.. రెజ్యూమ్ డెలివరీ కోసం జొమాటో హెల్ప్
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ఉద్యోగం వెతుక్కోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిరోజూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా జాబ్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. పైగా వెళ్లిన ప్రతీచోట తిరస్కరణలే ఎదురవుతుంటే జెన్యూన్ రిక్రూటర్స్‌ను కనుగొనడం కష్టం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. అమన్ ఖండేల్వాల్ అనే ట్విట్టర్ యూజర్.. జొమాటో డెలివరీ బాయ్ దుస్తులు ధరించడం ద్వారా యజమాని దృష్టిని ఆకర్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్లుగానే బెంగళూరులోని స్టార్టప్స్‌కు ఒక పేస్ట్రీల పెట్టెలో తన రెజ్యూమ్‌ను డెలివరీ చేశాడు.
ఖండేల్‌వాల్ తాను జొమాటో టీ-షర్ట్ ధరించిన ఫొటోను, పంపిన ఫుడ్ బాక్స్ చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో పాటు ఆ పేస్ట్రీల బాక్స్‌పై 'చాలా రెజ్యూమ్స్ చెత్త బుట్టలో పడతాయి. కానీ నాది మాత్రం మీ కడుపులో ఉంటుంది' అనే నోట్ మెన్షన్ చేశాడు. అంతేకాదు 'జొమాటో డెలివరీ బాయ్‌గా దుస్తులు ధరించి నా రెజ్యూమ్‌ను బెంగళూరులోని స్టార్టప్‌ల సమూహానికి పేస్ట్రీ బాక్స్‌లో డెలివరీ చేశాను. ఇది @peakbengaluru మూమెంట్' అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ యాడ్ చేశాడు.
వివరాల ప్రకారం ఖండేల్‌వాల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే, అతను ఇలా జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా కనిపించడం ప్రజల భద్రతా ప్రమాణాలను ప్రశ్నించేలా చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై జొమాటో ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఖండేల్‌వాల్ గతంలో కూడా ఇలాగే చేశాడని 'డున్జో'కు సంబంధించిన ఓల్డ్ ట్వీట్ వెల్లడించింది. పైగా ఈ టెంప్లేట్ ఆలోచన అతనిది కాదని, USలో ఒకరు డోనట్స్‌తో ఇదేవిధంగా చేసినట్లు గుర్తుచేస్తున్నారు.