భార్య దానికి నో చెప్పింది.. డయల్ 100కి కాల్ చేసిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే?

by Javid Pasha |
భార్య దానికి నో చెప్పింది.. డయల్ 100కి కాల్ చేసిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపదొచ్చినా.. ప్రమాదం ఎదురైనా.. అత్యవసర సమయాల్లో ముందుగా గుర్తొచ్చేది పోలీసులే. కాపాడండి అని డయల్ 100కు కాల్ చేయగానే 5నుంచి 10 నిమిషాల్లో ఆ లొకేషన్‌కు వచ్చి పోలీసులు సాయం చేస్తుంటారు. ఇదంతా తెలిసిందేనంటారా?. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రమైన కారణంతో డయల్ 100కు ఫోన్ చేసి వార్తల్లోకెక్కాడు. తన ప్రాబ్లమ్స్‌ను చెప్పేందుకు పోలీసులకు ఆరు సార్లు పోలీసులకు ఫోన్ చేసేసరికి.. విసిగిపోయిన పోలీసులు అతనిపైనే కేసు నమోదు చేశారు. ఇంతకీ అతడి ప్రాబ్లమ్ ఏంటనుకుంటున్నారా.? హోలీ పండగ రోజున తాను తెచ్చిన మటన్‌ కూర వండలేదని డయల్100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడీ మహానుభావుడు.

వివరాళ్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని చర్ల గౌరారానికి చెందిన నవీన్.. హోలీ పండగ రోజు మద్యం తాగి మటన్‌తో ఇంటికి వచ్చాడు. కానీ కూర వండేందుకు అతని భార్య నిరాకరించింది. దీంతో మత్తులో ఉన్న నవీన్.. తన భార్య మాంసం కూన వండటం లేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని డయల్‌ 100కు ఆరుసార్లు ఫోన్‌ చేసి పోలీసులను విసిగించాడు. దీంతో విసిగిపోయిన పోలీసులు తమ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నగేశ్‌ తెలిపారు.

Advertisement

Next Story