టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. 30 కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధం

by Vinod kumar |
టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. 30 కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం ధ‌ర్మారం గ్రామ ప‌రిధిలోని టెక్సో కంపెనీ గోదాంలో సోమ‌వారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన‌సాగుతున్న ఈ గోదాంలో విద్యార్థుల‌కు సంబంధించిన దుస్తులతో పాటు బెడ్ షీట్లు పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు రూ.38 కోట్ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్రస్తుతం అగ్నిమాప‌క సిబ్బంది నాలుగు ఫైరింజ‌న్లతో మంట‌ల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి శ్రమిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై టెక్సో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం ఎలా జ‌రిగింది..? ఎవ‌రైనా వ్యక్తుల చేశారా కోణంలో పోలీసులు వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Next Story

Most Viewed