ఎంతో మంది జీవితాలను మార్చేసిన దిగ్గజం : రతన్ టాటా మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-10-10 05:50:12.0  )
ఎంతో మంది జీవితాలను మార్చేసిన దిగ్గజం : రతన్ టాటా మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక ఇతని మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. రతన్ టాటాది బంగారం లాంటి హృదయం. దూరదృష్టిగల నాయకుడు. ఎంతో మంది జీవితాలను మార్చేసిన దిగ్గజం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని ఎన్టీఆర్ X వేదికగా నివాళులర్పించారు.

(video link credits to ntr X account)

Also Read: ఆయన సేవలను అందుకోని భారతీయుడు ఉండరు.. మెగా స్టార్ చిరంజీవి

Advertisement

Next Story