IPL మ్యాచ్‌లో కిస్సింగ్ సీన్.. దుమ్ములేపుతున్న మీమ్స్

by Mahesh |   ( Updated:2022-04-03 15:44:48.0  )
IPL మ్యాచ్‌లో కిస్సింగ్ సీన్.. దుమ్ములేపుతున్న మీమ్స్
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 15వ సీజన్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది. ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ మెరుపులతో పాటు ప్రత్యర్థి జట్ల మధ్య కవ్వింపు చర్యలతోనూ అభిమానులకు కావలసినంత మజా పంచుతోంది. అయితే పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పదో మ్యాచ్‌ ఏకపక్షంగా సాగడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ స్టాండ్స్‌లో ఒక భారతీయ జంట ముద్దు పెట్టుకోవడాన్ని క్యాప్చర్ చేసిన కెమెరా మ్యాన్ ఆ వెలితిని తీర్చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు హిలేరియస్ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఈ వైరల్ పిక్‌పై స్పందించిన ఎంటర్‌ప్రెన్యూర్ చిరాగ్ బర్జాత్యా.. 'ఐపీఎల్‌లో కిస్ క్యామ్ లాంటిది ప్రారంభించాలి. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇది మన జనాలకు పబ్లిక్ ఎఫెక్షన్‌‌ను మరింత ఆమోదయోగ్యంగా మారుస్తుంది' అని ట్వీట్ చేశారు. ఇక మీమ్స్ విషయానికొస్తే.. 'Me.. start watching ipl with my family', 'ఈ కపుల్ ఐపీఎల్ మ్యాచ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు', 'నా దేశం మారుతోంది', 'మా మ్యాథ్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్‌కు మధ్య ఎఫైర్ ఉంది. వారిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు', 'కపుల్స్‌ చెరొక టీమ్‌కు సపోర్ట్ చేస్తే ప్రతి బాల్‌కు ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు' అంటూ ఆ కపుల్ కిస్సింగ్ పిక్‌పై కామెంట్ చేస్తు్న్నారు.

Advertisement

Next Story