ఇంగ్లిష్ మీడియం బోధనకు 80 వేల మంది టీచర్లు

by Nagaya |
ఇంగ్లిష్ మీడియం బోధనకు 80 వేల మంది టీచర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందించనున్నామని, అందుకు టీచర్లకు ఇంగ్లిష్ లో బోధించేలా ప్రత్యేక ట్రైనింగ్​ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలవారీగా ఉన్న ఉపాధ్యాయులకు వర్చువల్​గా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని డీఎస్ఈ కార్యాలయంలో సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంపై మెళకువలు నేర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 81,590 మంది టీచర్లుకు 2 వేల మంది ట్రైనర్లతో శిక్షణను అందిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed