- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్‌లో రికార్డు స్థాయిలో 78 శాతం నమోదు
ఇంఫాల్: మణిపూర్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సోమవారం ఐదు జిల్లాల్లోని 38 స్థానాలకు ఎన్నికలు జరగగా 78.03శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,721 పోలింగ్ స్టేషన్లలో కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మణిపూర్ పోలీస్ సిబ్బంది మరణించినట్లు ఎన్నికల అధికారి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. టి పై ముఖ్ అసెంబ్లీ స్థానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరణించిన వ్యక్తిని నౌరెమ్ ఇబోచౌబాగా గుర్తించారు. చుర చంద్రాపూర్ జిల్లాలో ఇరు పార్టీల మధ్య ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడినట్లు చెప్పారు. ఓ చోట కాంగ్రెస్ కార్యకర్తలు ఈవీఎంను ధ్వంసం చేశారు. మణిపూర్ గవర్నర్ లా గణేషన్ ఇంఫాల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సీఎం బీరేన్ సింగ్ దంపతులు కూడా ఓటు వేశారు.