- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FLASH: భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని గోకుల్‌పురిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మురికివాడలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసెలు కాలిబూడిదయ్యాయి. ఈ మంటల్లో చిక్కకొని ఏడుగురు సజీవ దహనమయ్యారు. దాదాపు 60 పైగా గుడిసెలు కాలిపోయాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి ఘటన గురించి తెలిపారు. 13 వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల్లో మంటలను ఆర్పివేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్
ఢిల్లీ ఈశాన్య ఎంపీ మనోజ్ తివారీ ఏడుగురి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, కుటుంబ సభ్యులకు తక్షణమే కోటి రూపాయల సాయం ప్రకటించాలని ఆయన అన్నారు. మనోజ్ తివారీ ఈరోజు గోకుల్‌పురి ప్రాంతాన్ని సందర్శించనున్నారు.