Megastar Chiranjeevi: చిరంజీవి నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-10-26 14:33:10.0  )
Megastar Chiranjeevi: చిరంజీవి నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినీ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. మొదట విలన్ పాత్రలో నటించి మెప్పించిన ఆయన హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ హిట్స్(Blockbuster Hits) తన ఖాతాలో వేసుకున్నారు. 40 ఏళ్ల నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ మెగాస్టార్(Megastar) స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా ఆయన సినిమాలతో దేశమంతా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కొందరు ఆయన కోసం చనిపోవడానికి కూడా వెనకాడరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటికీ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రజెంట్ ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని వశిష్ట తెరకెక్కింస్తుండగా.. ఇందులో త్రిష(Trisha), అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది 2025 జనవరి 10వ తేదీన థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగాస్టార్(Chiranjeevi) సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావడంతో ఒకప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.

‘‘డిగ్రీ చదువుకునేటప్పుడు Y N M College Narsapur‌లో ‘రంగస్థలం’(Rangasthalam) మీద ‘రాజీనామా’ అనే తొలి నాటకం వేశాను. నటుడిగా తొలి గుర్తింపు వచ్చింది. అది Best Actorను చేయడంతో పాటు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించింది. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఒకప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రజెంట్ చిరు(Chiranjeevi) పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన అభిమానులు ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story