సీక్రెట్ రివీల్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్‌ అప్‌డేట్

by Javid Pasha |
సీక్రెట్ రివీల్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. స్కిప్ ఇంట్రో ఆప్షన్‌ అప్‌డేట్
X

దిశ, ఫీచర్స్ : ఐదేళ్ల క్రితం 'స్కిప్ ఇంట్రో' బటన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇది మూవీ ఇంట్రడక్షన్ లేదా సిరీస్‌ ఓపెనింగ్ క్రెడిట్స్ దాటవేసేందుకు యూజర్స్‌ను అనుమతించే ఈ బటన్.. దీని హిస్టరీ ఏంటి..? అసలు ఎలా పుట్టుకొచ్చింది? అనే విషయాలను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లోని 'స్కిప్ ఇంట్రో' బటన్‌ను ప్రతిరోజూ దాదాపు 136 మిలియన్ సార్లు ప్రెస్ చేయబడుతుందని పేర్కొంది నెట్‌ఫ్లిక్స్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల 195 సంవత్సరాల సంచిత సమయాన్ని(క్యుములేటివ్ టైమ్) ఆదా చేస్తుందని వెల్లడించింది. 15 శాతం మంది వినియోగదారులు ప్రతీ ఎపిసోడ్‌లో మొదటి ఐదు నిమిషాలు మాన్యువల్‌గా దాటవేస్తున్నారని నెట్‌ఫ్లిక్స్ పరిశోధనలో తేలిందని తెలిపిన ప్రతినిధులు.. చాలా మంది వ్యక్తులు టీవీ షో ఇంట్రడక్షన్స్ ఇష్టపడరనే ఆలోచనను ఇది బలపరిచింది.


ఈ క్రమంలోనే 10 సెకన్ల వంటి ప్రీసెట్ సమయంతో సాధారణ స్కిప్ బటన్‌ను అందించడం కంటే, Netflix మరింత నిర్దిష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లిందని తెలిపారు. స్క్రీన్‌‌పై ఒక బటన్‌ను సెట్ చేస్తే.. అది ఒకే క్లిక్‌తో యూజర్స్‌కు కావాల్సిన పని చేయాలని అనుకున్నట్లు వివరించారు. అంతేకాదు 'జంప్ పాస్ట్ క్రెడిట్స్' 'స్కిప్ క్రెడిట్స్' 'జంప్ ఎహెడ్', 'స్కిప్ ఇంట్రో' వంటి నంబర్ ఆఫ్ నేమ్స్ పరిశీలించిన తాము.. ఫైనల్‌గా 'స్కిప్ ఇంట్రో'తో ముందుకొచ్చినట్లు చెప్పారు. కాగా ఈ బటన్ 2017 ఆగస్టులో టీవీ, 2018 మేలో మొబైల్ యాప్స్‌కు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed