చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎస్ సోమేష్ కుమార్

by S Gopi |   ( Updated:2022-03-23 05:02:54.0  )
చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎస్ సోమేష్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రమాదంలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటును కూడా ప్రభుత్వం చేస్తదని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఘటన జరగడం దురదృష్టకరమని, సీఎం కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్వాహకులపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story