- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3.50 లక్షల గొర్రెల యూనిట్లు త్వరలో పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో: రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 3 లక్షల 50 వేల యూనిట్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ స్పష్టం చేశారు. డీడీలు చెల్లించిన లబ్దిదారులందరికీ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ మసబ్ ట్యాంక్ పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత 5 వేల కోట్లతో 4 లక్షల యూనిట్లు గొర్రెల పంపిణీ చేశామన్నారు. ఏటా గొర్రెల పంపిణీకి 6125 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. పశు సంవర్థ శాఖ అద్భుత కార్యక్రమాలు తీసుకొని లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.
అన్ని జిల్లాల అధికారులు పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్ లను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామ్ చందర్, పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రత్యేక అధికారి కళ్యాణ్ కుమార్,విజయ డైరీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కే. కామేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.