ఈ మ్యాజిక్ జరిగి 3 ఏళ్లు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-16 15:43:11.0  )
ఈ మ్యాజిక్ జరిగి 3 ఏళ్లు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక వచ్చిన అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. కానీ ఈ అమ్మడుకు హిట్స్ కంటే ఎక్కవ ఫ్లాప్‌లే ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి చదువులపై ఫోకస్ పెట్టింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఈ మ్యాజిక్ జరిగి 3 ఏళ్లు.. గ్రేట్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 2021లో రిలీజ్ అయిన ‘పెళ్లి సందడి’ మూవీ.. ఈ ఏడాదితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story