19 ఏళ్ల యువతికి విషమిచ్చిన విద్యార్థులు.. అందుకు ఒప్పుకోలేదనే..

by Javid Pasha |
19 ఏళ్ల యువతికి విషమిచ్చిన విద్యార్థులు.. అందుకు ఒప్పుకోలేదనే..
X

దిశ, వెబ్‌డెస్క్: కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా 19 ఏళ్ల యువతి చేత కొందరు దుండగులు విషం తాగించారు. దాంతో ఇంటికి చేరుకున్నప్పటి నుంచి తీవ్రంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆందోళన చెందిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందతూ యువతి మరణించింది. అయితే తన కుమార్తెకు తోటి విద్యార్థులే విషం ఇచ్చారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాజస్తాన్ భరత్‌పుర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు స్నేహితులు కలిసి 19 ఏళ్ల యువతికి విషం ఇచ్చారని, వారితో శృంగారం చేసేందుకు నిరాకరించినందుకే వారు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. అయితే అమ్మాయిని నిందితులు పలు సందర్భాల్లో శృంగారం చేసేందుకు అడిగారని, కానీ బాధితురాలు తిరస్కరించిందని తెలిపారు.

దాంతో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే బుధవారం యువతి ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐదుగురు స్నేహితులు కలిసి యువతి చేత ఏదో తెలియని ద్రవం తాగించారు. ఆ తర్వాత యువతి వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించిందని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే ఈ కేసును విచారిస్తున్నామని, ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story