తల, తోలు లేకుండా 19 కళేబరాలు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు

by Javid Pasha |
తల, తోలు లేకుండా 19 కళేబరాలు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. తల, తోలు లేకుండా 19 కళేబరాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో గోవధను నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక చర్చలు తీసుకుంటున్నాయి. అయితే పంజాబ్‌లో శనివారం 19 ఆవుల కళేబరాలు దొరికాయి. వాటికి తల, తోలు లేవు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ట్రాక్‌ల సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ కళేబరాలు దొరికాయని తెలిపారు. అయితే ఈ విషయంపై రాజకీయ నాయకులు నిరసన తెలిపారని, ఈ కేసును కుదిరినంత త్వరగా ఛేదిస్తామని, నిందితులను శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసను విరమించుకున్నారని ఎస్‌పీ ముఖ్తియార్ రాయ్ తెలిపారు. ఈ కేసును విచారించేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీని నిర్వహించామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story