Viral Video: మనవరాలితో ఆడుకుంటున్న 147 ఏళ్ల వృద్ధుడి వీడియో వైరల్

by Nagaya |   ( Updated:2022-08-11 07:22:18.0  )
Viral Video: మనవరాలితో ఆడుకుంటున్న 147 ఏళ్ల వృద్ధుడి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం మానవుడి జీవిత కాలం వందేళ్ల నుంచి 70 ఏళ్లకి పడిపోయింది. ఇక ఎవరైనా అంతకుమించి ఎక్కువకాలం జీవిస్తే వారి ఆహారపు అలవాట్లను మిగతావారు తెలుసుకోవడం చూస్తుంటాం. అయితే, ఏకంగా 147 సంవత్సరాలుగా బతికి ఉన్న ఓ వృద్ధుడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈయనకు సంబంధించిన ఓ వీడియో(Video) ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) గా మారింది. కాంబోడియా(Cambodia)కు చెందిన ఓ వృద్ధుడు మంచం పై పడుకొని తన చుట్టూ తిరుగుతున్న మనుమరాలిని ఆడిస్తున్నారు. ఆ వృద్ధుడు తన 7వ తరం అమ్మాయితో సంతోషంగా ఆడుకోవడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వయస్సులో కూడా జీవించి ఉండడం అంటే రాసిపెట్టి ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story