ప్లేగ్రౌండ్‌లో భారీ పేలుడు.. 12 మంది చిన్నారులు దుర్మరణం..

by Javid Pasha |
ప్లేగ్రౌండ్‌లో భారీ పేలుడు.. 12 మంది చిన్నారులు దుర్మరణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్లే గ్రౌండ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు మరణించారు. అంతేకాకుండా దాదాపు మరో 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. దేశంలో మహిళా శక్తినీ తాలిబన్లు తొక్కేశారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ హెరాట్‌లోని ఓ ప్లే గ్రౌండ్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది చిన్నారులు మరణించగా మరో 25 మంది తీవ్ర గాయాలతో చావుతో పోరాడుతున్నారు. అయితే ఈ పేలుడో మరణించిన, గాయపడిన పిల్లల సంఖ్యను ఏ ఒక్క రిపోర్ట్‌లోనూ రాయలేదని సమాచారం. దీనిపై ఓ తాలిబన్ అధికారి మాట్లాడుతూ.. బాంబులు తప్పకుండా ఇటీవల పెట్టినవై ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ఆ ప్లేగ్రౌండ్‌ను ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ ఆటలకు వినియోగిస్తామని, అందులో ఉన్న పేలుడు వస్తులను తీశామని చెప్పారు. అయితే పిల్లలు రావడానికి ముందు ఎవరైనా పెట్టి ఉండొచ్చని అన్నారు. అనంతరం ప్లేగ్రౌండ్‌ను తనిఖీ చేసిన స్థానిక పోలీసులు మరో రెండు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు.

Advertisement

Next Story

Most Viewed