- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి.. జిల్లా కలెక్టర్
దిశ,వనపర్తి : 12-14 వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను వేయించాలని అన్నారు. వనపర్తి జిల్లాలో 32,392 మంది పిల్లలను గుర్తించామని, రానున్న వారం పది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి అని ఆయన కోరారు.
వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సమన్వయంతో 2008, 2009, 2010 సంవత్సరాల్లో మార్చి 15 తేదీలోపు పుట్టిన పిల్లలకు కార్బీ వ్యాక్స్ వ్యాక్సిన్‌ను వేస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ను మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ రాజేందర్ గౌడ్,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రాంచందర్ రావు,మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఇస్మాయిల్,డాక్టర్ బాలమణి, మాస్ మీడియా అధికారి చంద్రయ్య,హెల్త్ ఎడ్యుకేటర్ మధు, ఆస్పత్రి సిబ్బంది,ఏ ఎన్ ఎం లు ఆశాలు పాల్గొన్నారు.