102 ఏళ్ల వృద్ధుడి రికార్డ్.. అరనిమిషంలో వంద మీటర్ల పరుగు

by Manoj |   ( Updated:2022-10-23 12:16:12.0  )
102 ఏళ్ల వృద్ధుడి రికార్డ్.. అరనిమిషంలో వంద మీటర్ల పరుగు
X

దిశ, ఫీచర్స్ : థాయ్‌లాండ్‌కు చెందిన 102 ఏళ్ల వృద్ధుడు సవాంగ్ జనప్రామ్.. కేవలం 27.08 సెకన్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఈ వయసు వ్యక్తుల కేటగిరీకి సంబంధించి ఉత్తమ గణాంకాలు నమోదుచేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు.

సౌత్‌వెస్టర్న్ సముత్ సాంగ్‌ఖ్రామ్ ప్రావిన్స్‌‌లో లాస్ట్ వీకెండ్ 'థాయ్‌లాండ్ మాస్టర్స్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్' నిర్వహించారు. ఈ మేరకు 100-105 ఏళ్ల కేటగిరికి సంబంధించిన అన్ని గోల్డ్ మెడల్స్‌ను జన్‌ప్రామ్ గెలుచుకున్నట్లు నేషనల్ న్యూస్ బ్యూరో ఆఫ్ థాయిలాండ్ (NNT) వెల్లడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో గతంలో నాలుగుసార్లు పాల్గొన్న జన్‌ప్రామ్.. థాయ్‌లాండ్‌లో ఫేమస్ స్ప్రింటర్‌గా పేరు పొందాడు. కాగా క్రీడల్లోకి ప్రవేశించడం వల్లే తాను శారీరకంగా బలపడ్డానని, ఎవరైనా సరే వ్యాయామం చేయడం వల్ల ఆకలి పెరిగి బాగా తినగలుగుతారని సవాంగ్ పేర్కొన్నాడు. నిజానికి సవాంగ్‌కు రోజుకోసారి వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉండగా.. ఈ గేమ్స్ ప్రారంభానికి ముందు స్థానిక స్టేడియంలో కుమార్తెతో కలిసి రోజుకు రెండుసార్లు నడవడం ప్రారంభించాడు.

ఇక సవాంగ్ ఆరోగ్యంపై స్పందించిన అతని 70 ఏళ్ల కూతురు సిరిపన్.. 'నాన్న నిరంతరం సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం వల్లే మానసికంగా మంచి స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే శారీరకంగా కూడా స్ట్రాంగ్‌గా తయారయ్యారు' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed