- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Gandhi: బీజేపీకి సీనియర్ ఎంపీ, మాజీ మంత్రి గుడ్ బై?
దిశ, వెబ్‌డెస్క్: Will Varun Gandhi, Maneka Gandhi Quit BJP?| కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి త్వరలో బిగ్ షాక్ తగలబోతోందా? ఆ పార్టీ ఎంపీలు వరుణ్ గాంధీ, మాజీ మంత్రి మేనకా గాంధీ త్వరలో బీజేపీని వీడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీకి వీడ్కోలు పలికి త్వరలో వారు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరుతారనే ఊహాగానాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కింది. త్వరలో జరగబోయే ఓ కార్యక్రమంలో వీరితో పాటు మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ కండువా కప్పుకోబోతున్నారనే టాక్ బెంగాల్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశం అవుతోంది. అయితే గత కొంత కాలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలపై వరుణ్ గాంధీ బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన అంశాలతో పాటు జీఎస్టీ వాటిపై వరుణ్ గాంధీ మోడీ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారు. సొంత పార్టీపై వరుణ్ గాంధీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నానే చర్చ బీజేపీలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన మమతా బెనర్జీ పార్టీలోకి తన తల్లితో కలిసి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేకున్నా ప్రచారం మాత్రం ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. గతంలో వరుణ్ గాంధీ పశ్చిమ బెంగాల్ బీజేపీకి పరిశీలకుడిగా పని చేశారు. దీంతో ఆయన తృణమూల్ శిబిరానికి వెళుతున్నారనే టాక్‌పై బీజేపీ అధిష్టానం సైతం అతడిపై నజర్ వేసినట్లు తెలుస్తోంది. అసలు వరుణ్ గాంధీ ఎందుకు పార్టీ మారబోతున్నారనే దానిపై బీజేపీ పెద్దలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే మోడీకి పెద్ద మైనస్?
గాంధీ వారసులుగా రాహుల్ గాంధీ, సోనియా ఎక్స్ పోజ్ అయినంతగా వరుణ్ గాంధీ, మేనకా గాంధీ ఎక్స్ పోజ్ కాలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇందిరా గాంధీ వారసత్వాన్ని రాహుల్ గాంధీ అందిపుచ్చుకుంటున్నారనే టాక్ ఉంది. అదే సమయంలో కుటుంబ కలహాలతో బీజేపీలో చేరిపోయిన మేనకా గాంధీ, వరుణ్ గాంధీలు అదే పార్టీలో తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ వంశం అనే ట్యాగ్ లైన్ ఎంతో కొంత వరుణ్ గాంధీపై ఉంది. గాంధీ వారసుడు ఒకరు తమ పార్టీలోనూ ఉన్నారని ఇన్నాళ్లు భావిస్తూ వస్తున్న బీజేపీకి వరుణ్ గాంధీ పార్టీ మారితే ఆ ఛాన్స్ ఉండదనే ప్రచారమూ జరుగుతోంది. ఇదే, జరిగితే అది మోడీ, అమిత్ షా ద్వయానికి పెద్ద మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయా అనేదాని చర్చనీయాంశం అవుతోంది.
ఇది కూడా చదవండి: సోనియా ఏమైనా సూపర్ మహిళా: కేంద్ర మంత్రి