Pushpa 2: 'పుష్ప 2' విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సుకుమార్ మరి దేవీ శ్రీ ప్రసాద్ సంగతేంటి?

by Prasanna |   ( Updated:2024-11-11 06:15:29.0  )
Pushpa 2: పుష్ప 2 విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సుకుమార్ మరి దేవీ శ్రీ ప్రసాద్ సంగతేంటి?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప2 (Pushpa 2). ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతీ సారి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇప్పుడు, ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ మేకర్స్ తెలిపారు. మూవీ రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు, ఈ సినిమాకి ఇంకో అడ్డంకి వచ్చినట్లు తెలుస్తోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పుష్ప2 (Pushpa 2) బీజీఎమ్ విషయంలో సుకుమార్ హ్యాపీగా లేరట. దేవీ శ్రీ ప్రసాద్( Devi Sri Prasad) సరైన బ్యాక్ స్కోర్ ఇవ్వకపోవడంతో సుకుమార్ మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, షూట్ చేసిన కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, పుష్ప పార్ట్ 1లో పాటలు మంచిగా ఉన్నప్పటికీ బీజీఎమ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే చెప్పుకోవాలి.

'పుష్ప2' లో దేవీ మ్యూజిక్ సుకుమార్ కు నచ్చలేదని కొందరు అంటున్నారు. ఇప్పుడు, బీజీఎమ్ కోసం వేరే వాళ్ళని తీసుకొస్తే దేవి కెరీర్ ముందుకు సాగడం కష్టమే అని అనుకుంటున్నారు. 'కాంతారా ' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఎంచుకున్నట్లు టాక్ నడుస్తుంది. మరో వైపు తమన్ పేరు కూడా వినిపిస్తోంది. మరి, దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story