- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలుగు హీరోల రక్తదానం… దయచేసి మీరూ చేయండి..
అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదంటారు. మనం ఇచ్చే రక్తం… కొన్ని ప్రాణాలను నిలబెడుతుంది. అందుకే రక్తం దానం చేయాలి.. ప్రాణాలు నిలబెట్టాలి… ఇది మానవుడిగా తోటి మానవుల పట్ల బాధ్యత. ఈ బాధ్యతను.. రక్తం అవసరాన్ని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ డొనేషన్ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత బ్లడ్ అవసరం అవుతుంది. పైగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల రక్తం సరైన సమయంలో అందకా… ఆపరేషన్లు జరగకా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చిరు స్వయంగా రక్త దానం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో రక్తం కొరత ఏర్పడిందని… తాను ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ లోనే రక్త దానం చేశారు. మీరు కూడా రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా బ్లడ్ డొనేట్ చేసే సమయంలోనూ మాస్క్ ధరించి కనిపించిన చిరు… ఎలాంటి పరిస్థితుల్లోనైనా బయటకు వస్తే మాస్క్ తప్పనిసరన్న సందేశాన్ని ఇచ్చారు.
During this #CoronaCrisis period, there is a huge dearth of life saving blood. I appeal to ALL to come forward and donate blood to help those in need of blood. You may visit your nearest blood bank or call them so they will guide you on the procedure to donate blood at this time pic.twitter.com/E1AGwdZBCf
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2020
నేచురల్ స్టార్ నాని కూడా రక్తదానం చేశారు. లాక్ డౌన్ వల్ల రక్తం కొరత చాలా ఏర్పడిందని.. మనం ఇంట్లోనే ఉండడం వల్ల బయట సమస్యలు చూడలేకపోతున్నామన్నరు. శస్త్ర చికత్సలకు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం చాలా అవసరమన్నారు. కరోనా కారణంగా రక్త దానం ఆగిపోరాదన్న నాని… బ్లడ్ డొనేషన్ వల్ల కరోనా వచ్చే చాన్స్ ఉందన్న అబద్ధపు పుకార్లను నమ్మకుండా… దయచేసి పరిస్థితులను అర్ధం చేసుకుని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Tags: Chiranjeevi, Nani, Blood Donation, Lock Down, Tollywood