మంత్రి తలసానిని కలిసిన టాలీవుడ్ ప్రతినిధులు

by Shyam |   ( Updated:2021-05-22 01:55:51.0  )
Minister Talasani Srinivas Yadav
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం షూటింగ్‌లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులకు అవసరమైన నిత్యావసర వస్తువులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందజేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఇండస్ట్రీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న తమకు అండగా నిలిచి ఆదుకున్న మిమ్మల్ని మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తుందని, అందరు దీనికి సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం శానిటైజర్‌ను వినియోగించడం వంటి నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు. రెండో దశలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా సినీ పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడికీ కరోనా వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అధ్యక్షులు అనిల్ కుమార్, psn, దొర, చిత్రపురి కాలనీ సెక్రెటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed