రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!

by GSrikanth |   ( Updated:2023-10-20 02:33:39.0  )
రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!
X

కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనలతో తెలంగాణలో ఒక్కసారిగా సీన్​మారిపోయింది. బస్సు యాత్ర, బహిరంగ సభలు, కార్నర్​మీటింగ్‌లు సూపర్​సక్సెస్​అవుతున్నాయి. కాళేశ్వరం అవినీతి, డబుల్​బెడ్​రూమ్​పంపిణీపై నిర్లక్ష్యం, నిరుద్యోగంపై రాహుల్​గాంధీ.. కేసీఆర్ సర్కారుపై చేస్తున్న విమర్శలతో జనంతో కదలిక మొదలైంది. పలు చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా మీటింగ్‌లకు తరలి వస్తున్నారు. ఇప్పటికే ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి సభలు సక్సెస్​అయ్యాయి. సీనియర్​నేతలు మాత్రం నాటి వైఎస్ఆర్ యాత్రను గుర్తు చేసుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ‌కి హై ఓల్టేజ్​ లెవల్‌లో కొత్త ఊపు వచ్చింది. రాహుల్ గాంధీ బస్సు యాత్ర, సభల తర్వాత సీన్ మారింది. బస్సుయాత్ర, సభలకు జనాలు ఊహించిన తీరులో వస్తుండటం విశేషం. ఇందులో అత్యధికంగా యువత ఉండటంపై ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా యువత చేస్తున్న నినాదాలు రాష్ట్ర పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలపై రాహుల్ వేస్తున్న పంచ్‌లు కాంగ్రెస్ నేతల్లో జోష్​ను నింపుతున్నాయి. రెండు రోజుల బస్సు యాత్ర, సభల్లో ప్రధానంగా కాళేశ్వరం అవినీతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్ పై నిర్లక్ష్యం సహా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను రాహుల్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు.

లక్షకోట్ల అవినీతి..

తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కమీషన్ల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని రాహుల్ ప్రతి మీటింగ్‌లోనూ ఫైర్ అయ్యారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డరని రాహుల్ ఆరోపించారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో వివక్ష చూపుతున్నారని.. బీఆర్ఎస్ నాయకులు, మద్ధతుదారులు, అనుచరులకే అందుతున్నాయని మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ.. ఒక్క నోటిఫికేషన్‌ను కూడా సమర్ధవంతంగా పూర్తి చేయలేదని విమర్శించారు. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లితో పాటు కరీంనగర్ రాజీక్ చౌక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లోనూ రాహుల్ ఈ ఆస్త్రాలతోనే బీఆర్ఎస్‌పై ఎక్కు పెట్టారు. ఆయా సభలన్నీ సక్సెస్ కావడంతో నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. వైఎస్సార్ యాత్ర చేసే సమయంలో పబ్లిక్ నుంచి ఇలాంటి స్పందనే ఉండేదని, ఆ ప్రభావంతోనే రెండు సార్లు పార్టీ పవర్‌లో ఉన్నదని పలువురు సీనియర్లు గుర్తు చేసుకున్నారు.

పెరుగుతున్న పార్టీ గ్రాఫ్​

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో ఆయా జిల్లాల నుంచి బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నది. కానీ రాహుల్​ బస్సు యాత్రతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కోల్ బెల్ట్ ఏరియాల్లో పార్టీ గ్రాఫ్​ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి స్వయంగా కుమారుడు, కూతురు బస్సు యాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు కోరడంతో ప్రజల్లో సానుకూలత కనిపిస్తున్నది. దీంతోనే జనమంతా స్వచ్ఛందంగా మీటింగ్‌లు, యాత్రల్లో భాగస్వామ్యం అవుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తించాయి.

నెక్ట్స్ గ్రేటర్ హైదరాబాద్?

రెండో విడత బస్సు యాత్ర, సభలను గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టాలని పార్టీ సూత్రపాయంగా ఆలోచిస్తున్నది. ఉత్తర తెలంగాణలో పార్టీ మద్ధతు పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ జిల్లాను టచ్ చేస్తూ బస్సు యాత్రను ఫేజ్ 2 నిర్వహించాలని ప్రణాళికలు మొదలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మరింత పట్టు సాధిస్తే.. బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించడం ఖాయమని స్థానిక నేతలు చెప్తున్నారు. ఈ మేరకు గతంలో కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్‌లను అనుసంధానిస్తూ బస్సు యాత్రకు రూట్ మ్యాప్ తయారు చేయాలని టీపీసీసీ భావిస్తున్నది.


Read More..

రండి.. మాట్లాడుదాం.. గజ్వేల్ నాయకులకు CM KCR స్పెషల్ ఇన్విటేషన్

Advertisement

Next Story