- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో చేరికలు స్పీడప్.. క్యూలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మంగళవారం ఒక్క రోజే బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ కు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో పాటు పలువురు హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు హస్తం గూటికి క్యూ కడుతుండటం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఓ వైపు నేతల చేరికలు కొనసాగుతండగానే మరో వైపు ముఖ్యనేతలను కాంగ్రెస్ టచ్ లోకి తీసుకుండటం బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. వీరితో పాటు మరి కొంత మంది ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారంతో ఎవరు ఏ క్షణాన కారు దిగబోతున్నారో తెలియక గులాబీ క్యాడర్ కన్ఫ్యూజన్‌లోకి వెళ్తోంది.
పలు జిల్లాల్లో ఏక కాలంలో:
చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమే టార్గెట్ గా పలువురు ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకోంటోంది. తాజాగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మాదాపూర్ కార్పొరేటర్, హఫీజ్ పేట డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సైతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్చీలో చేరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు సైతం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి థాక్రేతో సమావేశం అయ్యారు. మరో వైపు ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా ఐదుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కోదాడ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ కే ఇవ్వడంపై చందర్ రావు గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో చందర్ రావుతో ఉత్తమ్ భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 19 మంది ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గుర్రంపొడు మండలానికి చెందిన ఒక జడ్పీటీసీ, నలుగురు ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు వందలాది మంది కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పార్టీకి బిగ్ షాక్ గా మారింది.
ముందే చెప్పిన ‘దిశ’:
నల్గొండ బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై 'దిశ' ముందే చెప్పింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామాల జరగబోతున్నాయని ‘దిశ’ ముందే కథనాన్ని ప్రచురించింది. ఇవాళ హైదరాబాద్ లోని స్టార్ క్యాంపెనర్, భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి నివాసంలో అబ్బొగోని రమేష్ తో పాటు మరికొంత మంది కౌన్సిలర్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.