బీజేపీ గెలిస్తే బండి సంజయే ముఖ్యమంత్రి

by GSrikanth |   ( Updated:2023-11-28 07:05:39.0  )
బీజేపీ గెలిస్తే బండి సంజయే ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సామాన్యుడు కాదని.. యుద్ధవీరుడు అని, ఆయనకు మోడీ అండగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలోచించి ఓటు వేయాలని, పదేళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్‌లో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి, పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకున్నాడని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందని, దేశ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.





Advertisement

Next Story