‘నేను మాట్లాడాను.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడం లేదు’

by GSrikanth |   ( Updated:2023-06-06 14:48:07.0  )
‘నేను మాట్లాడాను.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడం లేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘తెలంగాణ బిడ్డలారా.. మిత్రులారా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏదో ఒకటి రెండు మీడియా ఛానల్‌లో డబ్బులిచ్చి అబద్ధాలను ప్రచురిస్తున్నారని, ఆయన ట్రాప్‌లో పడొద్దు’’ అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను పొంగులేటి శ్రీనివాస్‌తో మాట్లాడినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా నైనా పోటీ చేస్తా కానీ కాంగ్రెస్‌లో చేరను అని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఖమ్మం అంత పర్యటన చేసినట్లు కేఏపాల్ తెలిపారు. 70 శాతం మంది ప్రజలు ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారని అన్నారు. పది నియోజకవర్గాల్లో తమకు రెడ్లు, కమ్మలు, దొరలు వద్దని ప్రజలు అంటూన్నారని పేర్కొన్నారు.


బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు 90 శాతం ఉన్నామని, వారు మనకు వద్దన్నారు. కాంగ్రెస్ పాలనలో 75 ఏళ్లుగా బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? అని ప్రశ్నించారు. వాళ్లు పంచుకోవడానికి బహుజనులను విడదీస్తున్నారని, కాబట్టి పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం లేదన్నారు. వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదని ఇదివరకే చెప్పారని అన్నారు. ఒక్క కర్ణాటకలో తప్ప.. కాంగ్రెస్ దేశం అంతట భూస్థాపితం అయ్యిందని విమర్శించారు. కనుక ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వొద్దని సూచించారు. కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఎంతోమంది రెడ్డిలు ఉన్నారని, ఇప్పటికే తొమ్మిది మంది సీఎం క్యాండెట్లు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, భట్టి విక్రమార్క ఏడుస్తున్నారని వెల్లడించారు. వారు కేఏ పాల్‌ను మూడు, నాలుగు సార్లు వారు కలిసినట్లు వెల్లడించారు. ఈ అగ్రవర్ణ, కుటుంబ పాలన మనకొద్దని, వారు ఏడుస్తున్నారని అన్నారు. అగ్రకుల ఆధిపత్యం వద్దని, ప్రజాశాంతి పార్టీయే ముద్దని అన్నారు.

Also Read..

CM KCR పాలమూరు పబ్లిక్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డిపై ఫైర్...

Advertisement

Next Story