- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందే కాకుండా మళ్లీ మూడోసారి అధికారం ఇవ్వాలని కేసీఆర్ వస్తున్నాడని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో మాట్లాడిన ఆయన.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్ భూములు కబ్జాచేశారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి ప్రైవేటు కాలేజీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు కానీ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేక పోయారని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిందే కాకుండా కాంగ్రెస్ పార్టీపై అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ కాదా? తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌కు కృష్ణ జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దొరలకు ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజల తెంగాణ రావాలంటే దొరల తెలంగాణ కూలిపోవాలన్నారు. తాము అధికారంలోకి రాగానే మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తేవడంతో పాటు పేదలకు రూ.500 లేక సిలిండర్, ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి రూ. లక్ష నగదు, తులం బంగారం ఇవ్వబోతుననట్లు హామీ ఇచ్చారు. ముదిరాజులను ఒక్క టికెట్ ఇవ్వని కేసీఆర్‌కు వారి ఓట్లు అక్కర్లేదా అని నిలదీశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేర వరకు తరమాల్సిన అవసరం వచ్చిందన్నారు. బొడుప్పల్‌లో వక్ఫ్ భూముల పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్నారని తమ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామన్నారు.