- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ సంపదను ప్రధాని తన మిత్రులకు దోచిపెడుతుంటే.. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఇస్తున్నాడని ఆరోపించారు. రెండు పార్టీలది ఫెవికాల్ బంధం అని నొక్కి చెప్పారు. ఈ రెండు పార్టీలను దేశం రాష్ట్రంలో నుంచి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది అన్నారు.
గ్రామ పంచాయితీలను బలోపేతం చేయడం, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీది అన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని మణిపూర్ మండుతున్నా.. ప్రధాని ఇప్పటివరకు భరోసా ఇవ్వలేదన్నారు.