రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణం!

by GSrikanth |   ( Updated:2023-12-04 10:27:08.0  )
రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్ తమిళి సై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఎల్పీ సమావేశంలో ఏకపక్షంగా రేవంత్‌ను ఖరారు చేస్తూ ఏఐసీసీకి పంపించడంతో హైకమాండ్ కూడా రేవంత్‌కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుంది. కాగా, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లును ఇప్పటికే రాజ్‌భవన్ పూర్తి చేసినట్లు సమాచారం.

Read More..

డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క

Advertisement

Next Story