- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి కీలక హామీ
దిశ, వెబ్‌డెస్క్: TSPSC బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గుమాస్తా స్థాయివారిని సభ్యులను చేయడంతోనే బోర్డు ఇలా తయారైందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రద్దు అయితేనే నిరుద్యోగులకు రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సెల్ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రీ, కొడులకు చలి జ్వరం పట్టుకుందని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి విమర్శించారు.
తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. మీనాన్న వల్ల కూడా కాదని రేవంత్ రెడ్డి అన్నారు.