తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

by GSrikanth |   ( Updated:2023-11-27 05:09:58.0  )
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల అధికారులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోడీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మోడీకి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అర్చకులు మోడీకి ప్రసాదం అందజేశారు. అనంతరం శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను టీటీడీ అధికారులు ప్రధానికి అందజేశారు. కాగా, షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందే మోడీ శ్రీవారిని దర్శించుకొని అతిథిగృహం చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. కాసేపట్లో తిరుమల నుండి ప్రధాని తెలంగాణకు బయలుదేరుతారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed