సొంతూరు బాట పట్టిన ఓటర్లు.. కిటకిటలాడుతోన్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు

by Anjali |   ( Updated:2023-11-29 05:35:08.0  )
సొంతూరు బాట పట్టిన ఓటర్లు.. కిటకిటలాడుతోన్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిన్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పలు సమస్యత్మాక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ పూర్తి కానుంది. అయితే ఈ క్రమంలో నగరాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఓటు వినియోగించుకోవాలని ఓటు వేయడం కోసం సొంతూరు బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఫుల్ రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సరిపడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్రయాణికులు బస్సు సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story