పారగాన్ చెప్పుల సుమన్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి..?

by GSrikanth |   ( Updated:2023-08-29 14:46:47.0  )
పారగాన్ చెప్పుల సుమన్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘పారగాన్ చెప్పులతో తిరిగిన బాల్క సుమన్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి?’’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ నేత దుర్గం భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బాల్క సుమన్ ఉద్యమం నుంచే కోవర్టుగా పని చేసే వాడని విమర్శించారు. ఉద్యమంలో ఎన్నో మోసాలకు పాల్పడ్డాడని స్పష్టం చేశారు. ఐదేళ్లేగా చెన్నూరు ప్రజలనూ మోసం చేస్తూనే ఉన్నాడన్నారు. అందుకే ఈసారి చెన్నూరు ప్రజలు బాల్క సుమన్‌కు బుద్ది చెప్పడానికి రెడీగా ఉన్నారన్నారు.

సుమన్‌ను తప్పకుండా ఓడిస్తామని నొక్కి చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలు నాశనం అవుతుంటే విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వెళ్లిన సుమన్ నోరు మెదపకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. సుమన్‌ను ఓడించే సత్తా తనలో ఉన్నదని భాస్కర్ ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ అవకాశం ఇవ్వాలని కోరారు. పీసీసీ స్పోక్స్ పర్సన్ మానవతా రాయ్ మాట్లాడుతూ.. బాల్క తీట మాటలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ లీడర్లను అవహేళన చేసేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మర్రి జనార్దన్ రెడ్డి, బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story