- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
70 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. మళ్లీ కేసీఆరే గెలుస్తాడన్న ప్రచారాన్ని, పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసి ఊహించని రేంజ్‌లో గ్రాఫ్ పెంచుకుంది. పోలింగ్‌కు రెండ్రోజులే ఉండటంతో డోర్ టు డోర్ ప్రచారంతో ఇవాళ అగ్రనేతలతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మరింత బూస్ట్ ఇచ్చేలా ఎన్‌ఆర్‌ఐలు మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు చెందిన IAF అనే సంస్థ వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులకు ఆమోదం తెలుపుతూ జాబితాను విడుదల చేసింది. మెత్తం 119 స్థానాలకు గాను 110కు ఆమోదం తెలియచేసింది. అందులో 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి, 37 స్థానాల్లో BRSకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల యొక్క గుణగణాలు మరియు స్థానిక ప్రజల ఫీడ్‌బాక్ తీసుకొని గెలిచే అవకాశం ఉన్నవారికి మాత్రమే ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆలోచించి జాగ్రతగా ఓటు వేయాలని, మత పార్టీలను దూరంగా ఉంచాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సెక్యులర్ పార్టీలను సెలెక్ట్ చేసుకోవాలని కోరింది.