బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తా.. MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-11-12 07:14:04.0  )
బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తా.. MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ కీలక నేత, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ కాదు కదా.. 8 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిరిసిల్లకు రమ్మంటారో, గజ్వేల్‌కు రమ్మంటారో, సిద్దిపేటకు రమ్మంటారో చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా. కేటీఆర్ స్పందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

అవసరమైతే తీగలు పట్టుకోవడానికి కూడా తాను సిద్ధమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి గెలిపిస్తా అని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి కేటీఆర్ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అసలు విద్యుత్ విషయంలో ఒక్క కేసీఆర్, కేటీఆరే కాదు బీఆర్ఎస్ నేతలంతా అబద్ధాలు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story