సనాతన ధర్మం వివాదంపై స్పందించిన MLC కవిత

by GSrikanth |   ( Updated:2023-09-16 10:03:00.0  )
సనాతన ధర్మం వివాదంపై స్పందించిన MLC కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధర్మం, మతం అనేది వ్యక్తిగత విషయాలు అని తాము నమ్ముతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదే విధానాన్ని తెలంగాణ గత తొమ్మిదేళ్లుగా పాటిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతున్న తరుణంలో ఈ సనాతన ధర్మం అంశంపై కవిత తొలిసారి స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతాల పేరుతో ప్రజల మధ్య ఎమోషన్స్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు చెప్పుకోవడానికి చేసిన పనులేమి లేకపోవడంతోనే ఈ రెండు పార్టీలు ప్రజల మధ్య లేనిపోని వివాదాలను తీసుకువస్తున్నాయని ఆరోపించారు.

ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారన్నారు. ధర్మం, రిలీజియన్ అనేవి ప్రజల వ్యక్తిగత విషయాలు అందువల్ల వాటి జోలికి వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్రం టార్గెట్ నేను కాదని అసలు టార్గెట్ కేసీఆర్ అని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని ఎప్పుడు ప్రజల్లో ఉండే తాము ఎన్నికల కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒకరు లేకుంటే మరొకరు ఈ దేశానికి ఆల్టర్నేట్ అని భావిస్తన్నాయన్నారు. కానీ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలిచిందో అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందన్నారు.


Advertisement

Next Story

Most Viewed