వచ్చే ఎన్నికల్లో పోటీపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-20 09:06:59.0  )
వచ్చే ఎన్నికల్లో పోటీపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధైర్యం కావాలి.. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పట్టణంలోని బట్టి వాడలో జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో జగిత్యాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని కాబట్టి ఆ బాధ్యత తనపై పడే అవకాశం ఉందని అన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదని అయితే పార్టీ హైకమాండ్ ఆ బాధ్యత తనపై పెడుతుందని అనిపిస్తున్నట్లుగా తెలిపారు. తాను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడం తప్పనిసరి అవుతుందని మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఇంతకాలం ప్రజల మధ్యనే ఉన్నానని ఇకముందు కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story