- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్లింలు అందరూ బీఆర్ఎస్‌కు ఓటేయండి.. ఒవైసీ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు అందరూ బీఆర్ఎస్‌కు ఓటేయండి అని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ పోటీలో ఉన్న చోట బీఆర్ఎస్‌కు.. ఎమ్ఐఎమ్ పోటీలో ఉన్న చోట ఎమ్ఐఎమ్‌కు ఓటు వేయాలని సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసిరారు.
పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం కాదని.. దమ్ముంటే రాహుల్ గాంధీ తనపై హైదరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఛాలెంట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత, సచివాలయ మసీదు కూల్చివేత పీవీ నర్సింహరావు హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, తిరిగి కాంగ్రెస్ బాబ్రీ మసీదును నిర్మించలేదని, కానీ, సచివాలయంలో కేసీఆర్ మసీదు నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మత కలహాలన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయన్నారు.