‘మునుగోడు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్‌తో పొత్తే వద్దు’

by GSrikanth |   ( Updated:2023-10-17 04:54:56.0  )
‘మునుగోడు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్‌తో పొత్తే వద్దు’
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు వ్యవహారం కొలిక్కి రావడం లేదు. సీపీఐకి కేటాయించిన రెండు సీట్లలో ఒకదానిపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరులో పార్టీ గెలవటం కష్టమని, మునుగోడు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అసలు మునుగోడు సెగ్మెంట్ తమకు ఇచ్చే పరిస్థితి లేకుంటే పొత్తు కూడా అవసరం లేదు అనే భావనకు సీపీఐ నేతలు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా మునుగోడు సెగ్మెంట్‌ ఇవ్వాలని పల్లా వెంకట్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అటు సీపీఎం అంశంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. మిర్యాలగూడతో పాటు మరో సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. కానీ, సీపీఎం నేతలు మాత్రం మిర్యాలగూడతో పాటు పాలేరు, ఇబ్రహీంపట్నంలలో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు పార్టీలతో చివరగా ఒకసారి చర్చించి పొత్తుపై నిర్ణయం తీసుకొని, రెండో లిస్ట్‌లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story