- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే మళ్లీ కాంగ్రెస్‌లో చేరా.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే నా లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించా.. కానీ, పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు. అందుకే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటేసినా.. బీజేపీకి ఓటేసినా కేసీఆర్‌కే లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 80 నుంచి 90 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. కాగా, గురువారం రాత్రి ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు ఉన్నారు.