జాన్సన్ అసలు ఎస్టీనే కాదు.. రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-22 06:25:46.0  )
జాన్సన్ అసలు ఎస్టీనే కాదు.. రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖానాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని బీఆర్ఎస్ అధిష్టానంపై మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే తనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించారని తెలిపారు. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తానని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. ఎన్నికలకు మూడు నెలలే సమయం ఉండటంతో నా నిర్ణయాన్ని అతి త్వరలో ప్రకటిస్తా అని తెలిపారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే ఊహించినట్లుగానే ఫస్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేల అభ్యర్థులకు స్థానికత అసమ్మతి, కొంత వ్యతిరేకత వస్తోంది. ఈ రెండింటినీ ఎదుర్కునేందుకు వారు ఈసారి తీవ్రంగా కష్టపడక తప్పదనే అభిప్రాయం ఏర్పడుతోంది. దీంతో పాజిటివ్ వాతావరణం ఏర్పర్చుకునేందుకు అసమ్మతి లీడర్లను స్వయంగా కలిసి సహకారం కోసం అప్పీలు చేసేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. మరి ఎంతమేరకు కలిసి వస్తుందో చూడాలి.

Advertisement

Next Story