ఐటీ పంజా.. కాంగ్రెస్‌ నేత ఇంట్లో రూ.40 కోట్ల నగదు స్వాధీనం

by GSrikanth |   ( Updated:2023-10-13 04:58:10.0  )
ఐటీ పంజా.. కాంగ్రెస్‌ నేత ఇంట్లో రూ.40 కోట్ల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు నగరంలో ఐటీ అధికారులు పంజా విసిరారు. శుక్రవారం నగరంలోని కీలక నేతల ఇళ్లలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కాంగ్రెస్ ముఖ్య నేత ఇంట్లో ఏకంగా రూ.40 కోట్ల నగదు పట్టుబడింది. ఈ నగదును ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తున్నట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై మీదుగా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తించారు. దొరికిన నగదుపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే భారీగా నగదు తెలంగాణకు చేరిందనీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటినుంచి పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్రంలోని నలుదిక్కులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు.. విమర్శలకు తావు లేకుండా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడంపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో నగదు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు ప్రతిసారీ పెరిగిపోతున్నాయని గణాంకాల ద్వారా వెల్లడి కావడంతో ఈసారి ఒకింత సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మూడు రోజుల టూర్ సందర్భంగా కేంద్ర సర్వీసు అధికారులను (జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు) సీరియస్‌గా మందలించింది. ఎలక్షన్ డ్యూటీని సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేసింది. వారితో ఉదయం మొదలు రాత్రి వరకు సమీక్షించిన ముగ్గురు కమిషనర్లు పలువురు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన మూడు రోజుల వ్యవధిలోనే వారిపై బదిలీ వేటు వేశారు.

Advertisement

Next Story

Most Viewed