కేసీఆర్‌ తీరుపై అసహనం.. కాంగ్రెస్‌పై సీపీఎం నేత తమ్మినేని పాజిటివ్ కామెంట్స్

by GSrikanth |   ( Updated:2023-08-22 07:23:05.0  )
కేసీఆర్‌ తీరుపై అసహనం.. కాంగ్రెస్‌పై సీపీఎం నేత తమ్మినేని పాజిటివ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌ తమకు శత్రువేం కాదని, తెలంగాణలో కలిసొచ్చే రాజకీయ శక్తులతో కలిసి పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ అవకాశవాదంగా వ్యవహరించారని అన్నారు. పొత్తులపై ప్రస్తుతం కేసీఆర్ వైఖరి మొండిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పొత్తులోనే కాదు.. మా విధానంతో కూడా విభేదించినట్లు తెలుస్తోందని అన్నారు. కేసీఆర్ తమకు ఒక్కో సీటు ఇస్తామని చెప్పారని, కానీ, మాతో మాటైనా చెప్పకుండా అభ్యర్థులను ప్రకటించారని అన్నారు. నేడు సీపీఐ, సీపీఎం జాయింట్ మీటింగ్ ఉంటుందని, తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story