బీఆర్ఎస్‌తో పొత్తుపై కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-19 12:59:48.0  )
బీఆర్ఎస్‌తో పొత్తుపై కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. చేరికలు, టికెట్ల కేటాయింపులతో రాష్ట్రంలో రాజకీయ సందడి మొదలైంది. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు బాల్ ప్రస్తుతం బీఆర్ఎస్ కోర్టులో ఉందని స్పష్టం చేశారు. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది బీఆర్ఎస్ అధిష్టానమే అని అన్నారు. నాలుగు అసెంబ్లీ సీట్లు కావాలని బీఆర్ఎస్‌‌ను కోరినట్లు తెలిపారు.

సీపీఐ ప్రతిపాదనను బీఆర్ఎస్‌ సానుకూలంగా స్పందించలేదని తెలిపారు. వచ్చే వారంలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామంటున్నారు.. ఆ తర్వాతే బీఆర్ఎస్‌తో పొత్తుపై మా వైఖరి తెలియజేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు వామపక్ష పార్టీలను గౌరవించారని గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో పొత్తు కావాలని వారే తమ వద్దకు వచ్చారని తెలిపారు. తామేం సపోర్ట్ చేస్తామని ముందే వాళ్ల వద్దకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story