బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం పార్టీలకు ఓటు వేయొద్దు: CPI(ML)

by GSrikanth |   ( Updated:2023-11-27 07:43:24.0  )
బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం పార్టీలకు ఓటు వేయొద్దు: CPI(ML)
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 30వ తేదీన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీ, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలు సహజీవన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మతోన్మాద రాజ్య స్థాపనకు, బడా కార్పొరేట్ శక్తుల ఏకపక్ష ఆధిపత్యానికి పూనుకుంటున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మతోన్మాద పోకడలకు, ఎజెండాకు లోక్‌సభలో బలపరుస్తూ బీఆర్ఎస్ ఓటేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్, ఎమ్ఐఎంలు బీజేపీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని క్విడ్‌ప్రోకో పద్దతిని అనుసరిస్తున్నదని తెలిపారు. ఈ కూటమి దేశానికి ప్రమాదకరమైనదని వెల్లడించారు. నయా హిట్లర్, అభినవ రజాకారు నిజాం కూటమి ఇది అని అభిప్రాయప్డడారు. చట్ట సభలో ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రశ్నిస్తూ, ఓటు వేయాలని పిలుపునిచ్చారు.




Advertisement

Next Story