Jaggareddy: ఇంత శాడిజం ఎందుకు రా బాబు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-19 14:15:14.0  )
Jaggareddy: ఇంత శాడిజం ఎందుకు రా బాబు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియడం లేదని విమర్శించారు. తన సంగారెడ్డి నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ కేడర్‌ను చూసి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. ‘యాత్రను బాగా సక్సెస్ చేశారు జగ్గారెడ్డి గారు’ అని రాహుల్ గాంధీ తనను ప్రశంసించారని గుర్తుచేశారు. జోడో యాత్ర సమయంలోనే తన పేరు కూడా రాహుల్‌కు నోటెడ్ అయిందని తెలిపారు.

యాత్రను సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డానని, గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, అలాంటి తనపై ఎందుకు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాత్రయాత్ర జరిగిన పదిరోజులకే నేను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. 2018లోనే తనపై కేసులు పెట్టి.. జైల్లో కూడా పెట్టారని.. అలాంటిది బీఆర్ఎస్‌లోకి తానేందుకు వెళ్తానని అన్నారు. బీఆర్ఎస్‌తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావొద్దని నా భార్యను పోటీకి పెట్టాను.. సీఎం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story