సచివాలయం ఓపెనింగ్‌కు వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు

by GSrikanth |   ( Updated:2023-12-23 06:26:23.0  )
సచివాలయం ఓపెనింగ్‌కు వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. మంగళవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 'నేను ఇప్పుడే కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్లాను. ఈ భవనం ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన తన ఫామ్ హౌస్ నుంచే తిరిగి తెలంగాణ పాలనకొనసాగించారు' అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ భవనం ప్రజా భవనంగా మారుతుంది. ప్రజా తెలంగాణకు చిహ్నంగా మారబోతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story