రేవంత్‌కు గిఫ్ట్ ఇస్తా.. అభిమానులకు అద్దంకి దయాకర్ కీలక మెసేజ్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-11-11 15:39:11.0  )
రేవంత్‌కు గిఫ్ట్ ఇస్తా.. అభిమానులకు అద్దంకి దయాకర్ కీలక మెసేజ్ (వీడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో: తుంగతుర్తి టికెట్ వస్తుందని ఆశించినా చివరకు నిరాశే ఎదురైందని, అయినా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నానని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. టికెట్ రాలేదని అభిమానులు, అనుచరులెవ్వరూ ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు.

క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని, గెలిపించుకుని సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, రేవంత్‌రెడ్డికి గిఫ్టుగా ఇస్తానని తెలిపారు. టికెట్ రానందుకు బాధగా ఉన్నా సంతోషంగానే ఉన్నానని, మందల సామియేలుకు సంపూర్ణంగా సహకరించడమేకాక ఆయన గెలిచే విధంగా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీడియో ద్వారా తన మనసులోని మాటను అద్దంకి దయాకర్ పంచుకున్నారు.

Advertisement

Next Story